Advertisementt

కమల్ ముద్దు కోసమా..తమన్నా ఆరాటం!

Mon 26th Oct 2015 12:31 PM
kamal haasan,tamanna,mouli director,kamal haasan with tamanna,tamanna in kamal haasan movie,shriya,nayanthara  కమల్ ముద్దు కోసమా..తమన్నా ఆరాటం!
కమల్ ముద్దు కోసమా..తమన్నా ఆరాటం!
Advertisement
Ads by CJ

కథానాయిక‌లు కెరీర్ ఆరంభంలో సీనియ‌ర్ల‌తో క‌లిసి న‌టించ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. ఒక్క‌సారి సీనియ‌ర్ల‌తో క‌లిసి న‌టిస్తే ఇక కుర్ర హీరోల సినిమాల‌కి దూర‌మైపోతామ‌నేది వాళ్ల భ‌యం. అయితే న‌య‌న‌తార‌, శ్రియలాంటి క‌థానాయిక‌లు మాత్రం ఆ అభిప్రాయం త‌ప్ప‌ని నిరూపించారు. న‌య‌న్ త‌న మొద‌టి సినిమానే ర‌జ‌నీకాంత్‌తో చేసింది.  ఇప్పుడు త‌న‌కంటే చిన్న‌వాళ్ల‌యిన కుర్ర‌హీరోల‌తో న‌టిస్తోంది. శ్రియ కూడా అంతే. ర‌జ‌నీకాంత్ సినిమాలో న‌టించాక చాలా మంది యంగ్ హీరోల చిత్రాల్లో అవ‌కాశాలు సంపాదించింది. అలాంటి ఉదాహ‌ర‌ణ‌ల్ని భ‌రోసాగా తీసుకొని ఇప్పుడొస్తున్న కొత్త‌భామ‌లు చాలామంది సీనియ‌ర్ల‌తో క‌లిసి న‌టించ‌డానికి ఆస‌క్తి చూపుతున్నారు. త‌మ‌న్నా కూడా క‌థ బాగుంటే ఎవ్వ‌రితోనైనా న‌టిస్తా అని ఓపెన్ ఆప‌ర్లు ఇస్తూ వ‌చ్చింది. కానీ ఆమెకి ఎక్కువ‌గా కుర్ర హీరోల‌తోన‌టించే అవ‌కాశాలే వ‌చ్చాయి. 

తాజాగా మాత్రం త‌మ‌న్నాకి క‌మ‌ల్‌తో క‌లిసి న‌టించే అవకాశం వ‌చ్చింద‌ట‌. త‌మ‌న్నా ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌ల‌ని త‌న అభిమాన హీరోలుగా చెబుతుంటుందామె. అయితే వాళ్ల‌తో క‌లిసి న‌టించే అవ‌కాశం మాత్రం రాలేదు. ఇప్పుడు అనుకోకుండా క‌మ‌ల్ నుంచి పిలుపు రావ‌డంతో డేట్లు ఖాళీ లేక‌పోయినా స‌రే సినిమా చేయ‌డానికి ఒప్పుకొంద‌ట త‌మ‌న్నా. ఎలాగైనా డేట్లు స‌ర్దుబాటు చేస్తాన‌ని చెప్పింద‌ట‌. క‌మ‌ల్‌లాంటి న‌టుల‌తో క‌లిసి తెర‌పై క‌నిపించ‌డం ఓ గొప్ప పుర‌స్కారంలాంటిద‌ని ఆమె చెబుతోంద‌ట‌. క‌మ‌ల్ కోసం మౌళి అనే సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు త‌యారు చేసిన క‌థ‌తో ఆ చిత్రం తెర‌కెక్క‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల త్రిష క‌మ‌ల్‌తో క‌లిసి చీక‌టిరాజ్యం లో న‌టించింది. ఇప్పుడు త‌మ‌న్నాకి ఆ ఛాన్సొచ్చింద‌న్న‌మాట‌.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ