Advertisementt

అష్టాచమ్మా, ఉయ్యాలా జంపాలా.. ఇప్పుడు తను నేను

Mon 26th Oct 2015 10:36 AM
asta chamma producer p.rammohan,uyyala jampala producer p.rammohan,rammohan directing movie,director shobhan son santosh entering as hero  అష్టాచమ్మా, ఉయ్యాలా జంపాలా.. ఇప్పుడు తను నేను
అష్టాచమ్మా, ఉయ్యాలా జంపాలా.. ఇప్పుడు తను నేను
Advertisement
Ads by CJ

బాబీ, వర్షం చిత్రాల దర్శకుడు కీ.శే. శోభన్‌ తనయుడు సంతోష్‌ ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సన్‌షైన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై అష్టాచమ్మా వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను, అక్కినేని నాగార్జున, డి.సురేష్‌బాబులతో కలిసి ఉయ్యాలా జంపాలా వంటి యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మించిన పి.రామ్మోహన్‌ ఇప్పుడు శోభన్‌ తనయుడు సంతోష్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాడు. అష్టాచమ్మా, ఉయ్యాలా జంపాలా చిత్రాలకు సంబంధించి స్క్రిప్ట్‌ సైడ్‌ రామ్మోహన్‌ ఎఫర్ట్‌ గురించి అందరికీ తెలిసిందే. ఆ చిత్రాలు విజయం సాధించడంలో రామ్మోహన్‌ పాత్ర చాలా వుంది. స్క్రిప్ట్‌ పర్‌ఫెక్ట్‌గా జడ్జ్‌ చెయ్యడంలో అతనికి వున్న అనుభవంతో ఇప్పుడు తనే దర్శకుడుగా మారుతున్నాడు. 

సంతోష్‌ హీరోగా తన దర్శకత్వంలో తనే నిర్మాతగా వ్యవహరిస్తూ సన్‌షైన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మించే చిత్రానికి తను నేను అనే టైటిల్‌ని కన్‌ఫర్మ్‌ చేసినట్టు తెలిసింది. స్క్రిప్ట్‌ విషయంలోనే కాదు రొటీన్‌కి భిన్నంగా టైటిల్స్‌ పెట్టడంలోనూ తనకి మంచి టేస్ట్‌ వుందని తనునేను అనే టైటిల్‌తో మరోసారి ప్రూవ్‌ చేశాడు దర్శకనిర్మాత పి.రామ్మోహన్‌.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ