Advertisementt

అప్పుడు మహా బిజీ.. ఇప్పుడు రెండుతో సరి.!

Mon 26th Oct 2015 09:41 AM
hero allari naresh,allari naresh new movies,allari naresh in mohan babu movie,allari naresh in kannada movie victory remake  అప్పుడు మహా బిజీ.. ఇప్పుడు రెండుతో సరి.!
అప్పుడు మహా బిజీ.. ఇప్పుడు రెండుతో సరి.!
Advertisement
Ads by CJ

రాజేంద్రప్రసాద్‌ తర్వాత కామెడీ హీరోగా నరేష్‌ అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడని అందరూ భావించారు. దానికి తగ్గట్టుగానే ఒక దశలో లెక్కకు మించి సినిమాలు చేస్తూ క్షణం కూడా ఖాళీలేని హీరో అయ్యాడు. కానీ, ఒక్కసారిగా అతని డౌన్‌ ఫాల్‌ మొదలైంది. వరసగా అతను చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టడం ప్రారంభించాయి. దీంతో సడన్‌గా ఖాళీ అయిపోయాడీ సడన్‌స్టార్‌. ప్రస్తుతం మోహన్‌బాబు కాంబినేషన్‌లో మామ మంచు అల్లుడు కంచు అనే చిత్రం కమిట్‌ అయ్యాడు. దీంతోపాటు ఈశ్వరరెడ్డి దర్శకత్వంలో సీనియర్‌ నిర్మాత చలసాని గోపి తనయుడు చౌదరి నిర్మించే చిత్రం కూడా చేయబోతున్నాడు. కన్నడలో 2013లో విడుదలై సూపర్‌హిట్‌ చిత్రంగా నిలిచిన విక్టరీ అనే చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందనుంది. 

ఎప్పుడూ నాలుగైదు సినిమాలు చేస్తూ బిజీగా వుండే నరేష్‌ ఇప్పుడు రెండు సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌లో వున్నాయి. అతని లాస్ట్‌ హిట్‌ సినిమా సుడిగాడు. ఈ సినిమా తర్వాత అతను చేసిన ఎనిమిది సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. మరి ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాలతో అయినా నరేష్‌ మళ్ళీ తన అల్లరిని కొనసాగిస్తాడేమో చూడాలి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ