ఒకప్పుడు అంటే ఎన్టీఆర్, ఎయన్నార్, కృష్ణ వంటి స్టార్స్... రాజ్యమేలుతున్న సమయంలో హీరోల ఇమేజ్‌ను బట్టి కాకుండా కేవలం కథానుసారం టైటిల్స్‌ను పెట్టేవారు. కానీ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి హీరోలు రాజ్యమేలిన సమయంలో హీరో ఇమేజ్‌కు తగ్గట్లుగా పవర్‌ఫుల్ టైటిల్స్‌ను పెట్టేవారు. కానీ ఈమధ్యకాలంలో స్టార్ హీరోలు మన పాతతరం స్టార్స్‌ను ఆదర్శంగా తీసుకొని కథకు తగ్గ విభిన్నమైన టైటిల్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. పవన్‌కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో వచ్చిన అత్తారింటికి దారేది టైటిల్స్‌తో ఈ ట్రెండ్ మరలా ఊపందుకొంది. ఇటీవల అల్లుఅర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రానికి సన్నాఫ్ సత్యమూర్తి అనే అట్రాక్టివ్ టైటిల్‌ను పెట్టారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా తాజాగా సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రానికి నాన్నకు ప్రేమతో అనే టైటిల్‌ను పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే చిత్రానికి జనతా గ్యారేజ్ (ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడును) అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఇక నితిన్-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో రూపాందుతున్న చిత్రానికి అ..ఆ... అనే విభిన్నమైన టైటిల్‌ను పెట్టారు. అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి అనేది ఈ అ..ఆ కు అసలైన అర్థం. దానిని సింపుల్‌గా అ..ఆ తో తేల్చేశాడు త్రివిక్రమ్. ఇలాంటి ఆసక్తికర టైటిల్స్ కూడా సినిమాపై ఆసక్తిని రేకెత్తించడానికి కారణం అవుతాయి.