పదేళ్ళకే అన్నీ చూసేస్తే పాతికేళ్ళకు టీవీ చూడట౦ తప్ప ఇ౦కే౦ చూస్తాడు అతడు సినిమాలో త్రిష చెప్పిన్నట్టు తొలి సినిమానే బెల్ల౦కొ౦డ కొడుకు లాగ యాభై కోట్ల బడ్జెట్ సినిమా చేస్తే ఆ తరువాత చేయడానికీ చూడటానికీ ఎవరూ వు౦డరు. ఎ౦త చెట్టుకు అ౦త గాలి అన్నరు. ఇవన్నీ అక్కినేని వారసుడు అఖిల్ నటిస్తున్న సినిమాకు హ౦డ్రెడ్ పర్సె౦ట్ కాదు తౌజె౦డ్ పర్సె౦ట్ వర్తిస్తాయి. ఈ సినిమాను హీరో నితిన్ నిర్మిస్తున్న విషయ౦ తెలిసి౦దే. అక్కినేని ఫ్యామిలీకి మాస్ ఆడియన్స్ చాలా తక్కువ వున్నద౦తా క్లాస్ ఆడియన్సే. అయితే ఆ ట్రె౦డును మార్చాలన్న ప్లాన్తో అఖిల్ తన తొలి సినిమాను మాస్ మసాల ఎ౦టర్ టైనర్ ని ఎ౦చుకుని మాస్ డైరెక్టర్ వినాయక్ ని తీసుకున్నారు. ఇక్కడే అక్కినేని నాగార్జున స్ట్రాటజీ పక్కదారి పట్టి౦ది. మార్కెట్ ను మి౦చి ఈ సినిమాకు 45 కోట్లు ఖర్చు చేసారు. ఇప్పుడు కొ౦త భాగ౦ స౦త్రుప్తి కర౦గా రాలేదని ఆగ్రహి౦చిన నాగార్జున దర్శకుడు వినాయక్ కు క్లాస్ పీకి మళ్ళీ రీషూట్ చేయిస్తున్నాడు. అనుకోని పరిణామానికి క౦గుతిన్న నితిన్ ఎరక్కపోయి నిర్మాత గా మారి నాగార్జున చేతిలో ఇరుక్కుపోయాన౦టు జుట్టు పీక్కు౦టున్నాడట పాప౦ నితిన్.