Advertisementt

భజరంగీ భాయిజాన్‌ తర్వాత హిట్టేది?

Sun 25th Oct 2015 10:49 AM
salman khan,bajrangi bhaijaan,dilwale,prem ratan dhan payo,bollywood  భజరంగీ భాయిజాన్‌ తర్వాత హిట్టేది?
భజరంగీ భాయిజాన్‌ తర్వాత హిట్టేది?
Advertisement
Ads by CJ

సల్మాన్‌ఖాన్‌ నటించిన భజరంగీ భాయిజాన్‌ తర్వాత ఇప్పటివరకు బాలీవుడ్‌కు మరో పెద్ద హిట్‌ లేదు. దాంతో బాలీవుడ్‌ మొత్తం ఈ మిగతా రెండు నెలలపైనే ఆశలు పెట్టుకుంది. భజరంగీ భాయిజాన్‌ తర్వాత మరలా తనే మరో సూపర్‌హిట్‌తో అందరినీ మెప్పించాలని బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ డిసైడ్‌ అయ్యాడు. ఆయన తాజాగా చేస్తున్న ప్రేమ్‌రతన్‌ ధన్‌పాయో చిత్రం దీపావళి కానుకగా నవంబర్‌ 12న విడుదలకు సిద్దమవుతోంది. ఇక నవంబర్‌ 27న రణభీర్‌కపూర్‌ నటించిన తమాషా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి ఇంతియాజ్‌ అలీ దర్శకత్వం వహిస్తుండగా దీపికా పడుకోనే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక క్రిస్మస్‌ కానుకగా షారుఖ్‌ఖాన్‌ చేస్తూన్న దిల్‌వాలే చిత్రం డిసెంబర్‌ 18న విడుదల కానుంది. చెన్నై ఎక్స్‌ప్రెస్‌ తర్వాత రోహిత్‌శెట్టితో మరోసారి షారుఖ్‌ చేయి కలిపి చేస్తున్న ఈ చిత్రంపై కూడా బాలీవుడ్‌ ఎన్నో ఆశలు పెట్టుకొంది. ఇక అదే తేదీన విడుదలకు సిద్దమవుతున్న సంజయ్‌ లీలా బన్సాలి తీస్తున్న భాజీరావు మస్తానీ పై కూడా బోలెడు అంచనాలు ఉన్నాయి. మరి ఈ చిత్రాలైనా ఘనవిజయం సాధించి ఈ ఏడాడికి బాలీవుడ్‌ శుభకరంగా వీడ్కోలు పలుకుతుందనే ఆశలో బాలీవుడ్‌ ట్రేడ్‌ వర్గాలు ఉన్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ