Advertisementt

వరుణ్‌తేజ్‌ నిర్ణయం సూపర్‌!

Sun 25th Oct 2015 10:27 AM
varun tej,mukunda,kanche,varun tej movies,puri jagannadh,chiranjeevi  వరుణ్‌తేజ్‌ నిర్ణయం సూపర్‌!
వరుణ్‌తేజ్‌ నిర్ణయం సూపర్‌!
Advertisement
Ads by CJ

సాధారణంగా ఇప్పటివరకు ఇండస్ట్రీకి పరిచయమైన మెగాహీరోలు రెండు మూడు చిత్రాలకే మాస్‌ హీరోలుగా మారాలని భావిస్తూ అలాంటి చిత్రాలే చేస్తుంటారు. కానీ ఆజానుబాహుడైన మంచి అందగాడైన మెగాహీరో వరుణ్‌తేజ్‌కు మాస్‌ ఇమేజ్‌కు సంబంధించిన క్వాలిఫికేషన్‌ అన్ని ఉన్నప్పటికీ ఆయన తనదైన సపరేట్‌ రూటులో ముందుకు వెళ్తున్నాడు. తన రెండో చిత్రం కంచె లో ఆయన నటన చూసిన వారు ఆయన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇలా విమర్శకుల ప్రశంసలను ఆయన పొందుతున్నాడు. ఈ చిత్రంలో ఆయన చూపిన పెర్ఫార్మెన్స్‌ చూస్తే అద్బుతం అని అనకుండా వుండలేం. రెండో చిత్రంతోనే అతి క్లిష్టమైన పాత్రను, విభిన్న కోణాలలో కనిపించే పాత్రను ఆయన ఎంతో ఈజ్‌తో చేశాడు. ఇక ఆయన నటనతో పాటు డైలాగ్‌ డెలివరీ, డిక్షన్‌ వంటివి ఆయన సెటిల్డ్‌ పర్ఫార్మెన్స్‌కు అద్దంపడుతున్నాయి. తన కెరీర్‌ మొదట్లో ఆయన తన పెదనాన్న మెగాస్టార్‌ చిరంజీవి ఎలాంటి విభిన్నమైన పాత్రలను చేసి మెప్పించాడో, డైలాగ్‌ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్‌లో ఎంత గొప్పగా నటించేవాడో అదే దారిలో వరుణ్‌తేజ్‌ నడుస్తున్నాడు. హీరోయిజంను, స్టార్‌ హోదాలను పక్కనపెట్టి వెరైటీ సినిమాలపైనే తన ఫోకస్‌ పెట్టాడు. ఇదే ఆయన లో మిగిలిన రొటీన్‌ మెగాహీరోలకు విభిన్నంగా కనిపిస్తోంది. త్వరలో విడుదలకు సిద్దమవుతున్న పూరీజగన్నాథ్‌ డైరెక్షన్‌లోని సినిమాలో ఆయన సెంటిమెంట్‌ను కలిగిన పాత్రను పోషిస్తున్నాడు. ఇందులో మదర్‌ సెంటిమెంట్‌ అద్బుతంగా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా స్టార్‌హీరోగా కాకుండా నటునిగా తనను తాను ప్రెజెంట్‌ చేసుకుంటూ... అలాంటి కథలకు, పాత్రలకే ప్రాధాన్యం ఇస్తున్న వరుణ్‌తేజ్‌ తన లక్ష్యాన్ని సాధించాలని అందరూ కోరుకుంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ