Advertisementt

తమిళ్‌లో అతనే భలే భలే మగాడు.!

Sun 25th Oct 2015 10:16 AM
telugu movie bhale bhale magadivoy,gv prakash in bhale bhale magadivoy remake,bhale bhale magadivoy movie remake in tamil and hindi,bhale bhale magadivoy movie director maruthi  తమిళ్‌లో అతనే భలే భలే మగాడు.!
తమిళ్‌లో అతనే భలే భలే మగాడు.!
Advertisement
Ads by CJ

నాని హీరోగా మారుతి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ నిర్మించిన భలే భలే మగాడివోయ్‌ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని రీమేక్‌ చేసేందుకు ఇతర భాషల దర్శకనిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. తమిళ్‌, హిందీ నిర్మాతలు ఆల్‌రెడీ ఈ చిత్రం రీమేక్‌ రైట్స్‌ తీసుకున్నారని సమాచారం. హిందీలో ఈ చిత్రాన్ని ఎవరితో చేస్తారనేది ఇంకా తెలియలేదు గానీ తమిళ్‌లో మాత్రం మ్యూజిక్‌ డైరెక్టర్‌ కమ్‌ హీరో జి.వి.ప్రకాష్‌తో చేసే అవకాశం కనిపిస్తోంది. తమిళ్‌లో, తెలుగులో టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న ప్రకాష్‌ ఇప్పుడు హీరోగా కూడా బిజీ అయిపోయాడు. ప్రస్తుతం తమిళ్‌లో నాలుగైదు సినిమాల్లో హీరోగా నటిస్తూ మ్యూజిక్‌ డైరెక్షన్‌ కూడా చేస్తున్న ప్రకాష్‌ భలే భలే మగాడివోయ్‌ చిత్రాన్ని చూసి రీమేక్‌లో నటించేందుకు ఓకే చెప్పాడట. అయితే తమిళ్‌లో ఈ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్‌ చేస్తారు, ఎవరు నిర్మిస్తారు అనే విషయం అఫీషియల్‌గా ఎనౌన్స్‌ చెయ్యనప్పటికీ ప్రకాష్‌ ఈ చిత్రంలో నటిస్తాడన్నది మాత్రం కన్‌ఫర్మ్‌ న్యూస్‌. 

మిగతా భాషల నిర్మాతలు కూడా రైట్స్‌ కోసం పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు మారుతికి డైరెక్టర్‌గా వున్న ఇమేజ్‌ని భలే భలే మగాడివోయ్‌ మార్చేసింది. క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను తను కూడా తియ్యగలనని ప్రూవ్‌ చేసుకోవడమే కాకుండా ఇతర భాషల దర్శకనిర్మాతలను కూడా ఈ చిత్రంతో తనవైపు తిప్పుకోగలిగాడు మారుతి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ