Advertisementt

తని ఒరువన్‌ రీమేక్‌ డౌటేనట.!

Sun 25th Oct 2015 09:58 AM
ramcharan latest movie bruce lee,bruce lee cinejosh review,ramcharan new movie,ramcharan doubt about tani oruvan remake,ramcharan and gautham menon combo movie  తని ఒరువన్‌ రీమేక్‌ డౌటేనట.!
తని ఒరువన్‌ రీమేక్‌ డౌటేనట.!
Advertisement
Ads by CJ

తమిళ్‌లో జయం రవి హీరోగా నటించగా మోహనరాజా దర్శకత్వంలో రూపొందిన తని ఒరువన్‌ అక్కడ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో రామ్‌చరణ్‌ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఎన్‌.వి.ప్రసాద్‌, డి.వి.వి.దానయ్య కలిసి నిర్మిస్తారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా బ్రూస్‌లీ రిజల్ట్‌ వల్ల అప్‌సెట్‌ అయిన రామ్‌చరణ్‌ తనిఒరువన్‌ గురించి ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు రీమేక్‌లు చెయ్యని రామ్‌చరణ్‌ ఫస్ట్‌ టైమ్‌ రీమేక్‌ చేసేందుకు రెడీ అయ్యాడు. కానీ, బ్రూస్‌లీకి ఫ్లాప్‌ టాక్‌ రావడం, సురేందర్‌రెడ్డి గత చిత్రం కిక్‌2 కూడా పరాజయాన్ని చవిచూడడంతో ఈ కాంబినేషన్‌లో సినిమా చెయ్యడం అవసరమా అని ఆలోచిస్తున్నట్టు సమాచారం. 

రామ్‌చరణ్‌ ఎంతో ఇష్టపడి చెయ్యాలనుకున్న ఈ ప్రాజెక్ట్‌ బ్రూస్‌లీ రిజల్ట్‌ వల్ల సందిగ్ధంలో పడింది. అసలు ఈ సినిమా చేస్తాడా లేదా అనే డౌట్‌ కూడా వుందట. గౌతమ్‌ మీనన్‌తో సినిమా చేసేందుకు ఓకే చెప్పిన రామ్‌చరణ్‌ తని ఒరువన్‌ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో మరి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ