Advertisementt

బాహుబలి.. హోరు పెరుగుతుందా!

Sat 24th Oct 2015 09:40 AM
bahubali,bahubali the beginning,bahubali the conclusion,prabhas,ss rajamouli  బాహుబలి.. హోరు పెరుగుతుందా!
బాహుబలి.. హోరు పెరుగుతుందా!
Advertisement
Ads by CJ

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా... తదితరులు నటించిన బాహుబలి-ది బిగినింగ్‌ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 650కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పుడే టీవీలో ప్రసారం అవుతోంది. కాగా బాహుబలి-ది కన్‌క్లూజన్‌ కోసం ప్రస్తుతం రాజమౌళి రామోజీఫిలింసిటీలోని అనువైన ప్రదేశాల ఎంపికలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని మొదట అనుకున్నట్లు రెండు భాగాలుగా కాకుండా ఏకంగా మూడు భాగాలుగా తెరకెక్కించాలనేది రాజమౌళి ఆలోచనగా తెలుస్తోంది. బాహుబలి 2 షూటింగ్‌ను డిసెంబర్‌ నుండి ప్రారంభించనున్నట్లు వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి సినిమాను రిలీజ్‌ చేయాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు సమాచారం.  బాహుబలి చిత్రంతో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌కు ఇప్పుడు ఏకంగా హాలీవుడ్‌ నుండి ఆఫర్స్‌ వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రెండు సినిమా ఆఫర్లు ఆయనకు వచ్చాయని, ఆ చిత్రాల్లో నటిస్తే ప్రభాస్‌ ఇక అంతర్జాతీయ నటుడు కావడం ఖాయం అనే వార్త ఫిల్మ్‌నగర్‌లో షికారు చేస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ