Advertisementt

కబాలి కబుర్లు..!

Sat 24th Oct 2015 06:48 AM
kabali,rajinikanth,april 14th release,cine galaxy  కబాలి కబుర్లు..!
కబాలి కబుర్లు..!
Advertisement
Ads by CJ

సౌత్‌ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం కబాలి. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రాన్ని తమిళ న్యూ ఇయర్‌ అయిన ఏప్రిల్‌ 14న విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్రం తమిళ, తెలుగు ఓవర్‌సీస్‌ రైట్స్‌ను సినీ గెలాక్సీ సంస్థ సొంతం చేసుకుంది. గతంలో వీరు మనం, భలే భలే మగాడివోయ్‌ వంటి చిత్రాలను ఓవర్‌సీస్‌లో విడుదల చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఇటీవల వినాయక చవితి కానుకగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫస్ట్‌లుక్స్‌కు భారీ స్పందన వచ్చింది. కానీ ఈ పోస్టర్‌ ఓ కాపీ పోస్టర్‌ అనే విషయం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఫిలిప్పైన్స్‌ మూవీ టిక్‌టిక్‌ అనే యాక్షన్‌ కామెడీ చిత్రం పోస్టర్స్‌ను కలర్స్‌ కూడా మార్చకుండా ఈ సినిమాకు వాడుకున్నారని సమాచారం. కాగా టిక్‌టిక్‌ చిత్రం 2012లో విడుదలైంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ