టాలీవుడ్‌లో మంచి ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్‌కు ఇటీవల ఏమీ కలిసి రావడం లేదు. ఇది ఆయన స్వయంకృతాపరాధమే కారణం అని సినీ జనాలు అంటున్నారు. వరుసగా పరాజయాల పాలవుతున్న ఆయన చిత్రాలలో పండగచేస్కో కాస్త యావరేజ్‌గా ఉంది. కానీ ఇటీవల వచ్చిన శివమ్ డిజాస్టర్ కావడంతో ఆయన స్టోరీ మరలా మొదటికొచ్చింది. ప్రస్తుతం ఆయన కిషోర్ తిరుమల దర్శకత్వంలో హరికథ అనే టైటిల్‌తో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ కూడా చివరి దశకువచ్చింది. కాగా ఇటీవల ఈ చిత్రం రషెష్ చూసిన రామ్ సినిమాలోని కొన్ని సీన్స్ పరమ చెత్తగా ఉన్నాయని దర్శకుడిని పిలిపించి మరోసారి ఆ సీన్స్‌ను రీషూట్ చేయమని ఆదేశించాడట. రామ్ చాలాసార్లు సినిమా దర్శకత్వం విషయంలో వేలు పెడుతుంటాడని, చివరకు ఈ విషయంలో ఆయన పెద్దల సలహాలు కూడా తీసుకోడనే అపవాదు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో హరికథ దర్శకుడు కిషోర్ మరోసారి రీషూట్స్ అంటూ మొదలుపెట్టక తప్పని పరిస్థితి ఏర్పడటంతో గతి లేక రామ్ హుకుంకు సలామ్ చేయాల్సి వచ్చిందని యూనిట్‌సభ్యులు రామ్‌పై మండిపడుతున్నారు.