Advertisementt

అంతా మహేష్‌ చేతిలోనే ఉంది..!

Sat 24th Oct 2015 05:50 AM
mahesh babu,sreemanthudu,hindi remake,salman khan  అంతా మహేష్‌ చేతిలోనే ఉంది..!
అంతా మహేష్‌ చేతిలోనే ఉంది..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు నటించిన పోకిరి చిత్రాన్ని వాంటెడ్‌ పేరుతో రీమేక్‌ చేసి పెద్ద హిట్‌ కొట్టిన కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ మరోసారి ఓ సౌత్‌ సినిమా రీమేక్‌పై కన్నేశాడు. మహేష్‌, శృతిహాసన్‌ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చి కలెక్షన్ల దుమ్మురేపిన శ్రీమంతుడుపై ప్రస్తుతం సల్మాన్‌ఖాన్‌ కన్ను పడింది. ఈమేరకు మైత్రి మూవీస్‌ అధినేతలతో సల్మాన్‌ చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. అయితే అనుకోని విధంగా ఈ చిత్రం రీమేక్‌రైట్స్‌ కోసం పలు ప్రముఖ నిర్మాణసంస్థలు, హీరోలు కన్నేయడంతో ఈ చిత్రం బాలీవుడ్‌ రీమేక్‌ రైట్స్‌కు రోజురోజుకీ గిరాకీ పెరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్రం రీమేక్‌ హక్కులను 10కోట్లకు తీసుకోవడానికి సల్మాన్‌ సైతం సై అంటున్నాడు. కానీ ఈ చిత్ర నిర్మాణంలో మహేష్‌బాబు కూడా భాగస్వామి కావడంతో మైత్రి మూవీస్‌ అధినేతలు ఎవరికి బాలీవుడ్‌ రైట్స్‌ ఇవ్వాలి? అనే విషయాన్ని మహేష్‌ నిర్ణయానికే వదిలేశారట. మరి మహేష్‌ తీసుకొనే నిర్ణయంపైనే సల్మాన్‌ ఆశలు పెట్టుకొని ఉన్నాడని బాలీవుడ్‌ సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ