Advertisementt

చుట్టాలబ్బాయి లైన్ మీదకొచ్చేసాడు!

Fri 23rd Oct 2015 03:56 AM
chuttalabbayi movie opening,aadi,veerabadhram,ramu thalluri  చుట్టాలబ్బాయి లైన్ మీదకొచ్చేసాడు!
చుట్టాలబ్బాయి లైన్ మీదకొచ్చేసాడు!
Advertisement
Ads by CJ

లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది హీరోగా ఎస్‌.ఆర్‌.టి. మూవీ హౌస్‌ మరియు శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్‌ పతాకాలపై వీరభద్రమ్‌ దర్శకత్వంలో రాము తాళ్ళూరి, వెంకట్‌ తలారి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చుట్టాలబ్బాయి. ప్రేమకావాలి, లవ్‌లీ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో యూత్‌కి, ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరైన లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది, అహనా పెళ్లంట, పూలరంగడు వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో దర్శకుడుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న వీరభద్రమ్‌ ఫస్ట్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ అక్టోబర్‌ 22 విజయదశమి రోజున ప్రారంభమైంది. ఈ సందర్భంగా..

దర్శకుడు వీరభద్రమ్‌ మాట్లాడుతూ.. ఆది కెరీర్‌లో చుట్టాలబ్బాయి ఒక డిఫరెంట్‌ మూవీ అవుతుంది. మలయాళ హీరోయిన్‌ నమిత ప్రమోద్‌ ఈ చిత్రంలో ఆది సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. విజయదశమి రోజున మా చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేశాం. అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అన్ని అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది.. అన్నారు. 

నిర్మాతలు రాము తాళ్ళూరి, వెంకట్‌ తలారి మాట్లాడుతూ.. మా బేనర్స్‌లో ఒక చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చుట్టాలబ్బాయి రూపొందుతుంది. వీరభద్రమ్‌ చెప్పిన కథ చాలా అద్భుతంగా వుంది. ప్రతి ఒక్కర్నీ ఎంటర్‌టైన్‌ చేసే విధంగా ఈ చిత్రం వుంటుంది. విజయదశమి రోజున మా చుట్టాలబ్బాయి రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేశాం. జనవరిలో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం.. అన్నారు. 

లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది, నమిత ప్రమోద్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృథ్వి, రఘుబాబు, అభిమన్యు సింగ్‌, సురేఖావాణి, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, రచ్చ రవి, గిరిధర్‌, దువ్వాసి మోహన్‌, తాగుబోతు రమేష్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌, సినిమాటోగ్రఫీ: ఎస్‌.అరుణ్‌కుమార్‌, ఆర్ట్‌: నాగేంద్ర, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, మాటలు: భవాని ప్రసాద్‌, స్టిల్స్‌: గుణకర్‌, నిర్మాతలు: రాము తాళ్ళూరి, వెంకట్‌ తలారి, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: వీరభద్రమ్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ