Advertisementt

చిరు వల్ల సగం రేటు తగ్గింది!

Fri 23rd Oct 2015 03:06 AM
chiranjeevi,editor mohan,ram charan,thani oruvan  చిరు వల్ల సగం రేటు తగ్గింది!
చిరు వల్ల సగం రేటు తగ్గింది!
Advertisement
Ads by CJ

తమిళంలో సూపర్‌హిట్‌ అయి సంచలనాలు సృష్టిస్తోన్న తని ఒరువన్‌ చిత్రాన్ని త్వరలో సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఎన్వీప్రసాద్‌, దానయ్యలు కలిసి రీమేక్‌ చేయడానికి రంగం సిద్దం అవుతోంది. కాగా ఈ చిత్రంలో సమంత నటించనుందనే వార్తలు వస్తున్నాయి. కానీ ఆ వార్తలను సమంత ఖండించింది. ఈ చిత్రాన్ని మొదట్లో ఓ నిర్మాత 10కోట్లకు తెలుగు రీమేక్‌ రైట్స్‌ని అడిగినప్పటికీ జయం రాజా ఇవ్వలేదు. కానీ చివరకు చరణ్‌ కోసం చిరు దిగివచ్చి నేరుగా ఎడిటర్‌ మోహన్‌తో మాట్లాడటంతో ఈ హక్కులు కేవలం 5కోట్లకే లభించాయని అంటున్నారు. అంటే చిరు తన పరిచయం వల్ల దాదాపు సగం మొత్తాన్ని తగ్గించాడనే చెప్పాలి. అంతేకాదు... జయం రాజానే తెలుగు రీమేక్‌కు దర్శకత్వం వహించాలనే డిమాండ్‌ను సైతం ఎడిటర్‌ మోహన్‌.. చిరు కారణంగా వదులుకున్నాడు. కాగా బ్రూస్‌లీ పరాజయం తర్వాత తీవ్ర అసంతృప్తికిలోనైన చరణ్‌... మరోపక్క కిక్‌2 తో డిజాస్టర్‌ చవిచూసిన సురేందర్‌రెడ్డిల కాంబినేషన్‌లో ఈ చిత్రం రానుండటంతో అందరిలో ఆసక్తి మొదలయింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ