Advertisementt

సల్మాన్ స్నేహం కోసం రామ్‌చరణ్‌!

Fri 23rd Oct 2015 02:38 AM
salman khan,ram charan,prem ratan dhan payo,prem ratan dhan payo dubbing into telugu  సల్మాన్ స్నేహం కోసం రామ్‌చరణ్‌!
సల్మాన్ స్నేహం కోసం రామ్‌చరణ్‌!
Advertisement
Ads by CJ

సల్మాన్‌ఖాన్‌కి మెగాకుటుంబంతో ఎంతో సాన్నిహిత్యం ఉంది. ముఖ్యంగా సల్మాన్‌కు రామ్‌చరణ్‌ మంచి స్నేహితుడు. త్వరలో తానే నిర్మాతగా మారి రామ్‌చరణ్‌తో ఓ బాలీవుడ్‌ మూవీ తీయాలని సైతం సల్మాన్‌ భావిస్తున్నాడు. అసలు విషయానికి వస్తే ప్రస్తుతం సల్మాన్‌ఖాన్‌ ప్రేమ్‌రతన్‌ ధన్‌ పాయో అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సూరజ్‌భరద్యాత రాజశ్రీ మూవీస్‌ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈచిత్రాన్ని తెలుగులోకి అనువదించాలని సైతం సల్మాన్‌ నిర్ణయించాడు. గతంలో సల్మాన్‌ నటించిన మైనే ప్యార్‌కియా ను ప్రేమపావురాలు పేరుతో, హమ్‌ ఆప్‌కే హైకౌన్‌ చిత్రాన్ని ప్రేమాలయం పేరుతోనూ, హమ్‌ సాత్‌ సాత్‌ హై చిత్రాన్ని ప్రేమానురాగం టైటిల్‌తోనూ తెలుగులోకి అనువాదం చేసి మంచి విజయాలనే అందుకున్నాడు సల్మాన్‌. దీంతో తన ప్రేమ్‌రతన్‌ ధన్‌ పాయో చిత్రాన్ని కూడా తెలుగులోకి అనువాదం చేయాలని భావించి, తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పమని రామ్‌చరణ్‌ను కోరడం.. అందుకు రామ్‌చరణ్‌ అంగీకరించడం జరిగిపోయాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి తెలుగు టైటిల్‌ను త్వరలో ప్రకటిస్తారు. ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదలకు సిద్దమవుతోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ