రామ్‌చరణ్ హీరోగా వచ్చిన బ్రూస్‌లీ మొదటి షో నుండే నెగటివ్ టాక్ వచ్చేసింది. దాంతో రెండో రోజు నుండే కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ముక్కుతూ మూలుగుతూ నడుస్తోంది. తొలి వీకెండ్‌లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా కేవలం 20కోట్లు మాత్రమే సంపాదించింది. దీంతో ఈ చిత్రానికి భారీ నష్టాలు రావడం ఖాయమని తేలిపోయింది. సినిమాలో దమ్ము లేనప్పుడు ఎన్ని జిమ్మిక్కులు చేసినా మౌత్‌టాక్ ముందు అవి ఎందుకు పనికిరావని బ్రూస్‌లీ చిత్రం మరోసారి నిరూపించింది. శ్రీనువైట్ల అందించిన మూలకథను కోనవెంకట్, గోపీమోహన్‌లు డెవలప్ చేయడంలో విఫలమయ్మారని,కానీ పారితోషికంగా మాత్రం ఇద్దరూ చెరో రెండు కోట్లు తీసుకున్నారని సమాచారం. అసలు ఈ చిత్రానికి కోన వెంకట్, గోపీమోహన్‌లు మెగా ఒత్తిడితోనే పనిచేశారు కానీ మనసు పెట్టి చేయలేదని అంటున్నారు. ఇక శ్రీనువైట్ల డైరెక్షన్ సంగతి మాట్లాడుకోవడం దండగ అని చెప్పవచ్చు. కాగా ఈ నెల 22న విడుదలకు సిద్దమవుతోన్న మరో మెగాహీరో వరుణ్‌తేజ్ కంచె చిత్రం సక్సెస్ టాక్ వస్తే మాత్రం ఇక బ్రూస్‌లీ కి కలెక్షన్లపరంగా భారీ షాక్ తప్పదని అంటున్నారు.