Advertisementt

కసితో ఉన్న బెంగాల్ టైగర్..!

Wed 21st Oct 2015 03:35 AM
bengal tiger movie,raviteja,sampathnandi,kick2  కసితో ఉన్న బెంగాల్ టైగర్..!
కసితో ఉన్న బెంగాల్ టైగర్..!
Advertisement
Ads by CJ

ఆకలితో ఉన్నవాడికి కసి పెరుగుతుంది. ఇక అవమానాలు పడ్డవాడికి, వరుస ఫ్లాప్‌లలో ఉన్నవారికి కూడా కసి చాలా ఎక్కువగానే ఉంటుంది. నిజానికి బెంగాల్‌టైగర్‌ సినిమాను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రచ్చ తర్వాత దాదాపు రెండేళ్లకు పైగా పవన్‌తో సినిమా కోసం దర్శకుడు సంపత్‌ నంది వెయిట్‌ చేశాడు. కానీ చివరకు పవన్‌ ఆయన్ను తొలగించడంతో ఆ స్థానంలో మాస్‌మహారాజా రవితేజతో ఈ చిత్రం చేశాడు. ఈ చిత్రంతో ఎలాగైనా హిట్‌ కొట్టి తనను అవమానించిన వారికి గుణపాఠం నేర్పాలనే కసితో సంపత్‌నంది ఉన్నాడని సమాచారం. ఇక కిక్‌2 తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న రవితేజ సైతం ఈ ఒక్క ఫ్లాప్‌తో కసితో రగిలిపోతున్నాడు. ఇలా రూపొందిన బెంగాల్‌టైగర్ చిత్రం ట్రైలర్‌ ఇప్పుడు అందరికీ తెగ ఆకర్షిస్తోంది. సంపత్‌నంది-రవితేజల కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న బెంగాల్‌టైగర్‌ పూర్తి మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్‌గా రూపొంది విడుదలకు సిద్దమవుతోంది. ఇందులో రవితేజ చెప్పిన పంచ్‌ డైలాగ్స్‌ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. నేను సపోర్ట్‌తో కాదు... సోలోగా పైకి వచ్చిన వాడిని అంటూ అనేక పంచ్‌లు వేస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి తమన్నా, రాశిఖన్నాల గ్లామర్‌షో బాగా ప్లస్‌కానుంది. ఈ చిత్రంలో కామెడీ కూడా అదిరిపోయిందని టాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. మరి మొత్తానికి బెంగాల్‌టైగర్‌ విడుదలై ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటుందో వేచిచూడాల్సివుంది..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ