Advertisementt

క్రిష్‌కు మహేష్‌ దేవుడే..!

Wed 21st Oct 2015 12:14 AM
krish,mahesh babu,kanche movie,gabbar movie  క్రిష్‌కు మహేష్‌ దేవుడే..!
క్రిష్‌కు మహేష్‌ దేవుడే..!
Advertisement
Ads by CJ

గమ్యం,వేదం, కృష్ణం వందే జగద్గురం వంటి చిత్రాలతో తనదైన ప్రత్యేక శైలిని సొంతం చేసుకున్న దర్శకుడు క్రిష్‌. ప్రస్తుతం ఆయన మెగాహీరో వరుణ్‌తేజ్‌ హీరోగా కంచె సినిమా తీశాడు. ఈ చిత్రం 22వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది. కాగా క్రిష్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై పలువురికి మంచి అంచనాలు ఉన్నాయి. కాగా క్రిష్‌ కేవలం తెలుగుకే పరిమితం కాలేదు. హిందీలో ఆయన ఠాగూర్‌ చిత్రాన్ని గబ్బర్‌ పేరుతో తెరకెక్కించాడు. అలా ఆయన ఎవరో దేశం మొత్తానికి తెలిసింది. కాగా ఈ అవకాశం తనకు కేవలం మహేష్‌బాబు వల్లే వచ్చిందని క్రిష్‌ చెబుతున్నాడు. వాస్తవానికి ఆ సమయంలో క్రిష్‌ మహేష్‌తో శివమ్‌ టైటిల్‌తో ఓ చిత్రం చేయాలని ప్లాన్‌ చేశాడు. స్టోరీని మహేష్‌కు కూడా వినిపించాడు. కానీ ఎందువల్లో ఈ చిత్రం పట్టాలెక్కలేదు. ఈ సమయంలో బాలీవుడ్‌ ఫిల్మ్‌మేకర్‌ సంజయ్‌లీలా భన్సాలీ నుండి ఆయనకు గబ్బర్‌ కోసం పిలుపు వచ్చింది. మహేష్‌బాబు, ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్‌లు ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన సబీనాఖాన్‌కు క్రిష్‌ను సిఫార్సు చేశారు. అలా మహేష్‌, నమ్రతల వల్లనే తనకు ఈ బాలీవుడ్‌ చాన్స్‌ వచ్చిందని క్రిష్‌ స్వయంగా వెల్లడించాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ