Advertisementt

పవన్‌తో కలిసి నటించనున్న యంగ్‌ మెగాహీరో!

Tue 20th Oct 2015 10:04 AM
pawan kalyan,sardhar gabbarsingh,sai dharam tej  పవన్‌తో కలిసి నటించనున్న యంగ్‌ మెగాహీరో!
పవన్‌తో కలిసి నటించనున్న యంగ్‌ మెగాహీరో!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సర్దార్‌గబ్బర్‌సింగ్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. త్వరలో ఈ చిత్రం తర్వాతి షెడ్యూల్‌ కోసం ఆయన గుజరాత్‌ వెళ్లనున్నాడు.కాగా ఇటీవలే రేయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌ చిత్రాలతో ఇప్పుడిప్పుడే ఒక్కో మెట్టు ఎక్కుతున్న మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ పవన్‌కళ్యాణ్‌ సర్దార్‌గబ్బర్‌సింగ్‌లో ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడనేది ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఇందులో పవన్‌తో పాటు సాయి కూడా పోలీస్‌ అధికారిగానే కనిపిస్తాడని సమాచారం. ఇటీవలే సాయిధరమ్‌తేజ్‌ తనకు తన మామయ్యలైన మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌లతో కలిసి నటించాలని ఉందని తన కోరికను వెలిబుచ్చిన సంగతి తెలిసిందే. ఆయన కోరిక ప్రకారం ఇంత త్వరగా ఆయనకు పవన్‌ సినిమాలో కలిసి నటించే అదృష్టం వరించిందని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు అంటున్నాయి. కాగా తన మామయ్యల పోలికలు అచ్చుగా ఉండి, నటనలో కూడా మామయ్యల శైలిని అనుసరించే సాయికి సర్దార్‌గబ్బర్‌సింగ్‌లో కీలకపాత్ర రావడం నిజమే అయితే ఇంత త్వరగా ఆయన తన కోరిక తీరినట్లుగా భావించాలి. అంతేకాదు... ప్రస్తుతం పరిచయం అవుతున్న మెగాహీరోలందరిలో సాయి అంటే పవన్‌కు విపరీతమైన ఇష్టం అన్న విషయం అందరికీ తెలిసిందే. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ