ఈ ఆదివారం రెండు అరుదైన కలయికలు కలిశాయి. సినిమా భాషలో చెప్పాలంటే ఇదొక రేర్ కాంబినేషన్.. ఆ కాంబినేషన్సే.. చిరు-పవన్, కేసీఆర్-చంద్రబాబు. కాకతాళీయంగా వీరి కలయిక ఒకే రోజు జరగడం కూడా న్యూసే.. అయితే నిత్యం విమర్శలతో ఒకరిపై ఒకరి కత్తులు దూసుకునే ముఖ్యమంత్రులు కేసీఆర్-చంద్రబాబు ఇద్దరు కలిశారంటే... ఆ వార్తలో నిజంగా సెన్సేషన్ వుంది. రాజధాని శంకుస్థాపన కోసం చంద్రబాబు స్వయంగా కేసీఆర్ ఇంటికెళ్లి ఆహ్వానించడం నిజంగా ఇదొక గొప్పవార్తే. ఇది నిజంగా జనాల్లో కానీ మీడియాలో కానీ వద్దన్నా దానంతట అదే సన్సేషన్ అవుతుంది. అయితే చిరంజీవి, పవన్‌కళ్యాన్‌లు కలవడం, చిరును పవన్ అభినందించడ.. ఈ వార్తను న్యూస్ చేసింది మాత్రం మెగా వర్గాలే. అన్నదమ్ములు కలవడం కూడా ఏదో జరగరానిది జరిగిపోయినట్లుగా మీడియా వద్ద హంగామా చేయడం, మీడియా ఆహ్వానించడం చూస్తే..ఇద్దరి అనుబంధం మరీ ఇంతా మొక్కుబడిగా మారిందా అని సందేహం వస్తుంది. చిరు బ్రూస్‌లీ లో ఐదు నిమిషాలు కనిపిస్తేనే పవన్‌కళ్యాణ్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ అభినందిస్తే..ఇక 150వ సినిమాకు పవన్‌కళ్యాణ్ అన్నయ్య చిరును ఎలా అభినందిస్తాడో..ఎన్ని ప్రెస్‌మీట్‌లు పెడతాడో..అని అభిమానులు ఎదురుచూస్తున్నారు!