Advertisementt

పూర్తిగా మారిపోయిన మహేష్‌..!

Mon 19th Oct 2015 11:05 AM
mahesh babu,brahmothsawam,samantha,sruthihassan  పూర్తిగా మారిపోయిన మహేష్‌..!
పూర్తిగా మారిపోయిన మహేష్‌..!
Advertisement
Ads by CJ

వాస్తవానికి టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుకు ఓ హీరోయిన్‌తో నటించిన తర్వాత మరలా వారిని రిపీట్‌ చేయడం అలవాటు లేదు. కానీ ఈమద్య ఈ విషయంలో ఉన్న సెంటిమెంట్‌ను మహేష్‌ కాస్త పక్కనపెట్టాడనే చెప్పవచ్చు. ఇప్పటికే సమంతతో దూకుడు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలు చేసిన మహేష్‌ తాజాగా బ్రహ్మొత్సవం లో కూడా ఈమెతో రొమాన్స్‌ చేస్తున్నాడు. ఇక కాజల్‌ అగర్వాల్‌తో ఆల్‌రెడీ బిజినెస్‌మేన్‌ చిత్రం చేసిన ఆయన ప్రస్తుతం బ్రహ్మొత్సవం చిత్రంలో సైతం ఆమెతో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నాడు. ఇక ఆగడు లో మహేష్‌తో ఐటం సాంగ్‌ చేసిన శృతిహాసన్‌తో ఇటీవల శ్రీమంతుడులో పూర్తి స్థాయి హీరోయిన్‌గా నటింపజేశాడు. కాగా లేటెస్ట్‌గా మురుగదాస్‌తో ఓ చిత్రం చేయనున్న మహేష్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా శృతిహాసన్‌కు పచ్చజెండా ఊపాడని సమాచారం. ఇంతకు ముందు శృతిహాసన్‌ సూర్య సరసన మురుగదాస్‌తో సెవెన్త్‌సెన్స్‌ చేసింది. తాజాగా ఆమెను మహేష్‌ సరసస ఎంపికచేసుకున్నాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి గుర్తింపు ఉన్న శృతిహాసన్‌ను తీసుకుంటే ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న మురుగదాస్‌ మూవీకి ఆమె పెద్ద ఎస్సెట్‌ అని కోలీవుడ్‌ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ