Advertisementt

బ్రూస్‌లీకి పవర్‌స్టార్‌ హెల్ప్‌ అవుతాడా?

Sun 18th Oct 2015 02:31 AM
ramcharan latest movie bruce lee,ramcharan met pawan kalyan,pawan kalyan wished ramcharan,telugu movie bruce lee review,bruce lee movie cinejosh review  బ్రూస్‌లీకి పవర్‌స్టార్‌ హెల్ప్‌ అవుతాడా?
బ్రూస్‌లీకి పవర్‌స్టార్‌ హెల్ప్‌ అవుతాడా?
Advertisement
Ads by CJ

రామ్‌చరణ్‌, శ్రీను వైట్ల ఫస్ట్‌ కాంబినేషన్‌లో రూపొందిన బ్రూస్‌లీ ఈ శుక్రవారం రిలీజ్‌ అయిన విషయం తెలిసిందే. కొన్ని ఏరియాల్లో ఏవరేజ్‌గా, కొన్ని ఏరియాల్లో బిలో ఏవరేజ్‌గా, మరికొన్ని చోట్ల ఫ్లాప్‌ టాక్‌తో ఓవరాల్‌గా బ్యాడ్‌ టాక్‌తో రన్‌ అవుతున్న బ్రూస్‌లీకి ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌ విషెస్‌ కూడా తోడయ్యాయి. ఇవి బ్రూస్‌లీ రన్‌ని ఎంతవరకు పెంచుతాయనేది ప్రశ్న. బ్రూస్‌లీ అనే టైటిల్‌ ఎనౌన్స్‌ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై మెగాభిమానులు చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌ పెట్టుకున్నారు. వారి ఊహల్లో రామ్‌చరణ్‌ చేస్తున్న బ్రూస్‌లీ రేంజ్‌ చాలా పెద్దది. కానీ, కంటెంట్‌ పరంగా, పెర్‌ఫార్మెన్స్‌పరంగా, లుక్‌ పరంగా ఎలాంటి కొత్తదనం లేని బ్రూస్‌లీ చిత్రాన్ని చూసిన అభిమానులు బాగా హర్ట్‌ అయ్యారు. కొంతమంది ఫ్యాన్స్‌ కూడా సినిమాని చూడొద్దని చెప్పే పరిస్థితి ఏర్పడింది. సిట్యుయేషన్‌ చాలా బ్యాడ్‌గా వుంది కాబట్టే పవన్‌కళ్యాణ్‌ విష్‌ చేస్తే కలెక్షన్స్‌ పెరిగే అవకాశం వుందని ఆలోచించిన రామ్‌చరణ్‌ తనే స్వయంగా సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ సెట్‌కి వెళ్ళి బాబాయ్‌తో విషెస్‌ అందుకున్నాడు. 

సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ షూటింగ్‌లో వున్న పవన్‌కళ్యాణ్‌ని కలిసేందుకు వెళ్ళిన రామ్‌చరణ్‌కి సాదర స్వాగతం లభించింది. బ్రూస్‌లీ సక్సెస్‌ పట్ల పవన్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఫ్లవర్‌ బొకేతో రామ్‌చరణ్‌ని విష్‌ చేశాడట. ఎప్పుడూ లేనిది చరణ్‌ ప్రత్యేకంగా పవన్‌ని కలవడం, అతని నుంచి విషెస్‌ అందుకోవడం చూస్తే పవన్‌ వల్ల కలెక్షన్లపరంగా ఎంతో కొంత హెల్ప్‌ జరుగుతుందని చరణ్‌ భావించినట్టు అర్థమవుతోంది. అయితే పవన్‌కళ్యాణ్‌ విషెస్‌ కలెక్షన్లకు ఎంత వరకు హెల్ప్‌ అవుతాయనేది ప్రశ్నార్థకమే.! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ