Advertisementt

ఆ ప్రాజెక్ట్‌ గౌతమ్‌ మీనన్‌ చేయడం లేదట.!

Sun 18th Oct 2015 01:45 AM
director gautham menon,ramcharanan and gautham menon combo movie in may,gautham menon dropped 4 languages movie  ఆ ప్రాజెక్ట్‌ గౌతమ్‌ మీనన్‌ చేయడం లేదట.!
ఆ ప్రాజెక్ట్‌ గౌతమ్‌ మీనన్‌ చేయడం లేదట.!
Advertisement
Ads by CJ

తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో అల్లు అర్జున్‌, శింబు, పునీత్‌రాజ్‌కుమార్‌, పహాద్‌ ఫాజిల్‌లతో గౌతమ్‌ మీనన్‌ ఒక పెద్ద సినిమా స్టార్ట్‌ చెయ్యబోతున్నాడని, నాలుగు భాషల్లో ఈ చిత్రం ఏకకాలంలో నిర్మాణం జరుపుకుంటుందని ఈమధ్య మీడియాలో వార్త వినిపించింది. అయితే ఆ వార్తలో ఎంతమాత్రం నిజంలేదని తాజాగా అందిన సమాచారం. నాలుగు భాషల్లో నలుగురు హీరోలతో సినిమాలు చెయ్యాలన్న ఆలోచన గౌతమ్‌ మీనన్‌కి లేదని అతని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. 

ఇదిలా వుంటే ప్రస్తుతం రామ్‌చరణ్‌తో ఒక లవ్‌ ఎంటర్‌టైనర్‌ని రూపొందించేందుకు గౌతమ్‌ మీనన్‌ రెడీ అవుతున్నాడన్నది లేటెస్ట్‌ న్యూస్‌. రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్స్‌ తీయడంలో గౌతమ్‌మీనన్‌కి ఒక స్పెషాలిటీ వుంది. రామ్‌ చరణ్‌లాంటి మాస్‌ హీరోకి అటువంటి క్లాస్‌ డైరెక్టర్‌ తోడైతే ఇక ఆ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రామ్‌చరణ్‌, గౌతమ్‌మీనన్‌ల రేర్‌ కాంబినేషన్‌లో త్వరలోనే ఒక రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ రాబోతోంది. రామ్‌చరణ్‌ని సరికొత్త క్యారెక్టర్‌లో ప్రజెంట్‌ చేసేందుకు గౌతమ్‌ మీనన్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. మేలో ప్రారంభం కానున్న ఈ చిత్రానికి నిర్మాత ఎవరనేది తెలియాల్సి వుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ