పదిరోజుల క్రితం వరకూ అంతా ప్రశాంతంగానే వుంది. అక్టోబర్ 9న రుద్రమదేవి విడుదలైంది. అక్టోబర్ 16న బ్రూస్‌లీ రిలీజ్ అయింది. అఖిల్‌ను హీరోగా పరిచయం చేస్తూ వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న అఖిల్ చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్ 22న రిలీజ్ చేస్తామని ఎంతో కాలంగా చెప్తూ వస్తున్నాడు నిర్మాత నితిన్. ఉన్నట్టుండి ఒక్కసారిగా అఖిల్ చిత్రం దసరాకి రిలీజ్ కావడం లేదని ప్రకటించారు. దీంతో మిగతా సినిమాల దర్శకనిర్మాతలు పరుగులు పెట్టడం ప్రారంభించారు.
నవంబర్‌లో రిలీజ్ అవ్వాల్సిన వరుణ్‌తేజ్, క్రిష్‌ల కంచె అక్టోబర్ 22కి వచ్చేస్తోంది. 30న రిలీజ్ చెయ్యాలనుకున్న కళ్యాణ్‌రామ్ షేర్‌ని కూడా 22కే రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. అయితే షేర్ రిలీజ్ ఇంకా కన్‌ఫర్మ్ అవ్వలేదు. ఇవి కాక చిన్న సినిమాలు రాజుగారి గది, ప్లేయర్ చిత్రాలు కూడా అదే రోజు రిలీజ్ అవుతున్నాయి. ఇక ధనుష్ హీరోగా తమిళ్‌లో రూపొందిన మరియన్ చిత్రాన్ని కూడా తెలుగులో 22కే రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. అఖిల్ సినిమా రిలీజ్ వాయిదా పడడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో కదలిక స్టార్ట్ అయింది. దసరా రోజే తమ సినిమాలు రిలీజ్ చెయ్యడానికి హడావిడి పడుతున్నారు దర్శకనిర్మాతలు. మరి ఈ దసరా ఎవరికెలాంటి రిజల్ట్‌ని ఇస్తుందో వెయిట్ అండ్ సీ.