శింబు హీరోగా, త్రిష హీరోయిన్‌గా, జగపతిబాబు ప్రత్యేక పాత్రలో సెల్వరాఘవన్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న కాన్ చిత్రం ఆగిపోయింది. వరుణ్ మనియన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు 2013లో ఎనౌన్స్ చేశాడు. కానీ, 2013లోనే పివిపి సినిమా బేనర్‌లో సెల్వరాఘవన్ చేసిన వర్ణ ఘోర పరాజయం పాలవడంతో దానికి సంబంధించి కొన్ని ఆర్థిక సంబంధమైన విషయాల్లో సెల్వరాఘవన్ ఇరుక్కున్నాడు. దాంతో అతను బయటి సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశం లేదు. ఈ విషయం తెలుసుకున్న వరుణ్ మనియన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు.
పట్టువిడువని సెల్వరాఘవన్ తన భార్యతోపాటు మరో ఇద్దరు నిర్మాతలుగా ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఈసినిమా చేస్తున్నట్టు ఎనౌన్స్ చేశాడు. ఏప్రిల్ నెలలో ఫోటో షూట్ కూడా జరిగింది. ఈలోగా సినిమా డిలే అవడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేనని త్రిష సినిమా నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో కేథరిన్ త్రిసా వచ్చి చేరింది. షూటింగ్ స్టార్ట్ అయింది. 50 శాతం షూటింగ్ కంప్లీట్ చేశాడు. అయితే ఈ సినిమాకి ఫైనాన్స్ ఇచ్చేందుకు ఫైనాన్షియర్స్ ఎవరూ రాకపోవడంతో సినిమా ఆగిపోయింది. మళ్ళీ స్టార్ట్ అవుతుందో లేదోనని తమిళ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో హీరో శింబు చాలా అప్‌సెట్ అయి వున్నాడట. తన సినిమా ఇలా మధ్యలో ఆగిపోవడం జీర్ణించుకోలేకపోతున్నాడు. మరి సెల్వరాఘవన్ ఈ సినిమాని పూర్తి చేస్తాడో, అలా వదిలేస్తాడో చూడాలి.