Advertisementt

స్వీటీ మంచితనం..!

Sat 17th Oct 2015 04:08 AM
anushka,bahubali,rudhramadevi,varna,size zero  స్వీటీ మంచితనం..!
స్వీటీ మంచితనం..!
Advertisement
Ads by CJ

ఒక సినిమాకు కమిట్‌ అయిందంటే ఆ సినిమా కోసం అనుష్క తనకు సాధ్యమైన మేరకు కష్టపడుతుంది. అనుష్క ప్రధానపాత్రల్లో నటించిన బాహుబలి, రుద్రమదేవి సినిమాల కోసం ఆమె ఏళ్ల తరబడి శ్రమించింది. రెమ్యూనరేషన్‌ విషయంలో కూడా అనుష్క మరో ఓవర్‌గా ఏమీ డిమాండ్‌ చేయదనే మంచి పేరు ఆమెకు ఉంది. రుద్రమదేవి సినిమా విషయంలో దర్శకనిర్మాత గుణశేఖర్‌ను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదట. ముందు సినిమా పూర్తి చేయండి... ఆ తర్వాత డబ్బుల గురించి ఆలోచిద్దామని ప్రోత్సహించిందిట. కేవలం డబ్బు కోసం కాకుండా సినిమాపై అభిరుచితో పనిచేసే అరుదైన నటీనటుల్లో అనుష్క ఒకరు అని అంటున్నారు. అంతేకాదు... తాను నటించిన వర్ణ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో డిజాస్టర్‌గా మిగిలి పివిపి సంస్థకు భారీ నష్టాలు తేవడంతో ఆమె ఉదారంగా వ్యవహరించి సైజ్‌జీరో చిత్రాన్ని అతి తక్కువ రెమ్యూనరేషన్‌కు చేసిపెట్టందని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ