Advertisementt

సీనియర్‌ దర్శకునితో కమల్‌..!

Fri 16th Oct 2015 04:43 AM
kamal hassan,cheekatirajyam,rajeevkumar,chanakyan movie  సీనియర్‌ దర్శకునితో కమల్‌..!
సీనియర్‌ దర్శకునితో కమల్‌..!
Advertisement
Ads by CJ

చీకటిరాజ్యం అంటూ త్వరలో ప్రేక్షకులను పలకరించడానికి సిద్దమవుతోన్న లోకనాయకుడు కమల్‌హాసన్‌ తాజాగా ఓ సీనియర్‌ మలయాళ దర్శకునితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. చీకటిరాజ్యం తమిళ, తెలుగు భాషల్లో నిర్మితమవ్వగా, తాజా చిత్రం మాత్రం తమిళ,మలయాళ భాషల్లో రూపొందనుంది. ప్రముఖ సీనియర్‌ మలయాళ దర్శకుడు రాజీవ్‌కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈయన ఇంతకు ముందు కమల్‌హాసన్‌తో సుమారు 26ఏళ్ల కిందట చాణక్యన్‌ చిత్రం చేశాడు. మరలా ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ కాంబినేషన్‌ మరోసారి సెట్‌ అయింది. ప్రస్తుతానికి ఈ చిత్రం స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయింది. మిగిలిన తారాగణం, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. అతి త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కనుంది. త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ