కేవలం రాజమౌళి బాహుబలి పార్ట్1 కోసం దాదాపు మూడేళ్లుగా ప్రభాస్ అదే సినిమాకు తన సమయాన్నంతా కేటాయించాడు. ఇప్పుడు పార్ట్2 విషయానికి వస్తే మరో రెండేళ్లు అదే సినిమాకు కేటాయిస్తాడనే వార్తలు వస్తున్నాయి. అయితే భళ్లాలదేవ రానా మాత్రం బాహుబలి షూటింగ్ సమయంలోనే వచ్చిన గ్యాప్‌లో హిందీలో బేబి, తమిళంలో ఆరంభం , తెలుగులో రుద్రమదేవి చిత్రాలు చేశాడు. ఇప్పుడు పార్ట్ట్2 విషయంలో కూడా ఆయన పూర్తి సమయాన్ని కేవలం బాహుబలికే కేటాయించకుండా తనకున్న గ్యాప్‌లో కొరియోగ్రాఫర్ ప్రేమ్‌రక్షిత్ దర్శకత్వంలో ఒకటి, తమిళంలో బెంగుళూర్ డేస్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ విధంగా బాహుబలితో నటిస్తున్నప్పటికీ తనదైన చక్కని ప్లానింగ్‌తో మూడు నాలుగు సినిమాలు చేస్తూ పర్‌ఫెక్ట్ బిజినెస్‌మేన్ అనిపించుకుంటూ అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఆల్‌రౌండర్ అనిపించుకుంటున్నాడు రానా..!