హీరో నిఖిల్ కు ఇప్పుడు క్రేజ్ బాగా పెరిగింది. చిన్న బడ్జెట్ తో సినిమా తీసి హిట్ కొట్టాలనుకునే నిర్మాతలంతా ఇప్పుడు నిఖిల్ నే ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో శంకరాభరణం చిత్రంలో నటిస్తున్నాడు. మురుగదాస్ దగ్గర శిష్యునిగా చేసిన ఆనంద్ ఈ మధ్యకాలంలో సందీప్ కిషన్ తో టైగర్ చిత్రాన్ని తెరకెక్కించి హిట్ కొట్టారు. ప్రస్తుతం ఆనంద్, నిఖిల్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు. ఓ దయ్యం అబ్బాయిని ప్రేమిస్తే ఏమవుతుందనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. సినిమాకు టైటిల్ గా అమల అనే పేరును అనుకుంటున్నట్లు సమాచారం. దసరా సందర్భంగా ప్రారంభోత్సవ వేడుక నిర్వహించాలని భావిస్తున్నారు.