ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్ మూవీస్ కు క్రేజ్ పెరిగింది. పాండవులు పాండవులు తుమ్మెద చిత్రంతో మోహన్ బాబు కుటుంబం, మనం సినిమాతో అక్కినేని హీరోలు తెరపై కనిపించి సందడి చేసారు. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ గురించి అయితే.. మహేష్ బాబు చిన్నప్పుడే కృష్ణ తో కలిసి చాలా సినిమాల్లో నటించాడు. తాజాగా నందమూరి హీరోలు కూడా మల్టీస్టారర్ లో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇక మిగిలింది మెగా ఫ్యామిలీ మాత్రమే. ఈ విషయమై రామ్ చరణ్ ను ప్రశ్నించగా మంచి కథ కనుక దొరికితే ఖచ్చితంగా నాన్నగారు, నేను, పవన్ కళ్యాణ్ బాబాయ్ కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చాడు. ఈ కాంబినేషన్ కనుక సెట్ అయితే మెగాభిమానులకు పండగే..!