ప్రముఖ న్యూస్ ఛానల్ TV9 సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్ నిర్మాత గా రామరాజు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఒక మనసు చిత్రంలో యంగ్ హీరో నాగ శౌర్య సరసన నిహారిక హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు వంటి మంచి ప్రేమ కథా చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు రామరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో నిహారిక తల్లి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. దీంతో ఈ పాత్రకు ఎవరైతే న్యాయం చేయగలరో.. అని ఆలోచించి ప్రముఖ నటి రమ్యకృష్ణ ను ఎంపిక చేసారు. క్యారెక్టర్ నచ్చడంతో రమ్యకృష్ణ కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది. మంచి ఫీల్ గుడ్ సబ్జెక్టు తో ఈ చిత్రం ఉంటుందని, మెగా ఫ్యామిలీ ఇమేజ్ ఏ మాత్రం తగ్గకుండా.. నిహారిక కు నటిగా మంచి గుర్తింపు వచ్చే సినిమా అని చెబుతున్నారు..!