Advertisementt

సూర్యకు ట్విస్ట్‌ ఇచ్చిన హరి..!

Thu 15th Oct 2015 06:52 AM
surya,hari,singam series,singam3,anushka,sruthihassan  సూర్యకు ట్విస్ట్‌ ఇచ్చిన హరి..!
సూర్యకు ట్విస్ట్‌ ఇచ్చిన హరి..!
Advertisement
Ads by CJ

తెలుగులో సింహం అంటే నందమూరి బాలయ్య పేటెంట్‌ హక్కులు తీసుకున్నట్లు లెక్క. ఇక తమిళంలో సింగం అంటే అది సూర్యకు ఉన్న పేటెంట్‌ హక్కు. ఆయన కెరీర్‌ ఇబ్బందుల్లో ఉన్నప్పుడల్లా దర్శకుడు హరితో సింగం సిరీస్‌లు తీస్తూ సూర్య హిట్లు కొడుతుంటాడు. ఇప్పటికే సింగం, సింగం2 చిత్రాలు విడుదలై సంచలనం సృష్టించాయి. కాగా సింగం చిత్రమైతే టాలీవుడ్‌లో పెద్ద హిట్‌ అయి సూర్యకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ను తెచ్చిపెట్టడంతోపాటు 15కోట్ల మార్కెట్‌ రేంజ్‌ను తెచ్చిపెట్టింది. ఇక తాజాగా సూర్య వరుస ఫ్లాప్‌లో ఉన్నాడు. దీంతో హరి సూర్యతో సింగం3 తీయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. షూటింగ్‌ లోకేషన్ల కోసం మలేషియా వెళ్లాడు. మలేషియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సింగం 3 రూపొందనుంది. కాగా సింగం చిత్రానికి పర్‌ఫెక్ట్‌ సీక్వెల్‌గా సింగం 2 కథ రాసుకున్న హరి.. సింగం3 విషయంలో మాత్రం కేవలం సూర్య పాత్రనే తీసుకొని పూర్తిగా సింగం సిరీస్‌తో సంబంధం లేని సరికొత్త కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. మిగిలిన రెండు పార్ట్‌లతో ఈ సినిమాకు ఏమాత్రం సంబందం ఉండదు. కాగా ఇందులో సూర్య సరసన అనుష్క, శృతిహాసన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం సూర్య విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకునితో చేస్తున్న చిత్రం 24 షూటింగ్‌ పూర్తయిన వెంటనే అంటే నవంబర్‌లో సింగం3 సెట్స్‌పైకి వెళ్లనుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ