నేటితరం దర్శకుల్లో వినాయక్, పూరీ, త్రివిక్రమ్, రాజమౌళి... ఇలా ఎందరో టాప్ డైరెక్టర్స్ ఉన్నారు. కానీ వీరెవ్వరికీ సాధ్యంకాని ఓ ఫీట్‌ను వినాయక్ చేసి చూపించాడు. ఇది బహు అరుదైన రికార్డ్ అనే చెప్పాలి. యంగ్‌స్టార్స్‌ను డైరెక్ట్ చేస్తున్న ఇతర టాప్ డైరెక్టర్స్ మాదిరిగా కాకుండా అటు నిన్నటితరం సీనియర్‌స్టార్స్‌నే కాక తర్వాతి తరం యంగ్ స్టార్స్‌ను.... తాజాగా అఖిల్ వంటి కొత్త స్టార్స్‌ను డైరెక్ట్ చేస్తున్న ఘనత వినాయక్‌దే అని చెప్పాలి. చిరంజీవితో ఆల్‌రెడీ ఠాగూర్, బాలకృష్ణతో చెన్నకేశవరెడ్డి, వెంకటేష్‌తో లక్ష్మీ చిత్రాలను తెరకెక్కించిన వినాయక్ త్వరలో మరోసారి చిరు 150వ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం సంపాదించాడు. కాగా సీనియర్ స్టార్స్‌లో నాగార్జున మినహా అందరి స్టార్స్‌ను డైరెక్ట్ చేసిన ఆయన ప్రస్తుతం అఖిల్ డెబ్యూ మూవీ అఖిల్ చిత్రంలో నాగ్ కోసం ఓ ప్రత్యేక పాత్రను రెడీ చేసి ఆయనను డైరెక్ట్ చేసి నాగ్‌తో చేయలేదనే లోటును కూడా భర్తీ చేసుకున్నాడు. సో... ఈతరం దర్శకుల్లో ఈ విషయంలో వినాయక్ గ్రేట్ అని ఒప్పుకోవాల్సిందే.