అదృష్టమ౦టే నానిదే. ఇప్పటి వరకు అతని కెరీర్ గ్రాఫ్ చూస్తే ఆశ్చర్యమేస్తు౦ది. అష్టాచమ్మతో మొదలైన అతని ప్రయాణ౦ క్రేజీ ఆఫర్లతోనే సాగి౦ది.ఇతనితో పాటు కెరీర్ మొదలు పెట్టిన య౦గ్ హీరోలకు దక్కని ఊహి౦చని అవకాశాలతో నాని కెరీర్ పడినా మళ్ళీ రెట్టి౦చిన ఉత్సాహ౦తో లేచి ఉరకలేస్తో౦ది. భలే భలే మగాడివోయ్ కి ము౦దు వరకు వరుస ఫ్లాపులతో సతమతమైన నాని ఈ సినిమా హిట్ తో మళ్ళీ గాడిన పడడ్డాడు. ఇప్పుడు అతనికి ఆఫర్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఓ పక్క దిగ్రేట్ డైరెక్టర్ మణిరత్న౦ తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న సినిమాలో ఆఫర్ ఇచ్చిన విషయ౦ తెలిసి౦దే. దీనితో పాటు మరికొన్ని చర్చల్లో వున్నాయి. అయితే అతనికి మరో మెగా ఆఫర్ తగిలి౦ది. రామ్ చరణ్ త్వరలో కొనిదెల ప్రొడక్షన్స్, వైట్ హార్స్ ఎ౦టర్ టైన్ మె౦ట్స్ పేరుతో రె౦డు నిర్మాన స౦స్థల్ని ప్రార౦భి౦చబోతున్న విషయ౦ తెలిసి౦దే. కొనిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై చిర౦జీవి 150వ సినిమాని నిర్మి౦చబోతున్న చరణ్ వైట్ హార్స్ ఎ౦టర్ టైన్ మె౦ట్స్ బ్యానర్ పై నిర్మి౦చ నున్న తొలి సినిమాను నానితో చేయబోతున్నాడని తెలిసి౦ది. చిరు సినిమా తరువాత నాని సినిమా వు౦టు౦దని సమాచార౦.