ప్రస్తుతం నాన్నకు ప్రేమతో చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం ఎవరితో చేయబోతున్నాడనే వార్తల్లో చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. శ్రీమంతుడు హిట్ తో మంచి సక్సెస్ లో ఉన్న కొరటాల శివ తో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడన్నారు. మరో పక్క ఎప్పటినుండో తనకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తానని చెప్పిన వక్కంతం వంశీ తో సినిమా చేస్తారనే వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం హల్ చల్ చేస్తోంది. ఎన్టీఆర్ తన అన్న కళ్యాణ్ రామ్ తో సినిమా చేయాలని భావిస్తున్నాడట. అది కేవలం ప్రొడక్షన్ వరకు మాత్రమే కాదు. కళ్యాణ్ రామ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎన్టీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. దానికి తగిన విధంగా కథ సిద్ధమయితే నందమూరి వారసులు కలిసి నటించే మల్టీస్టారర్ సినిమా చూడొచ్చు..?