Advertisementt

రామ్‌చరణ్‌ వద్ద డబ్బులు లేవా..?

Wed 14th Oct 2015 06:53 AM
ram charan tej,mahesh babu,sreemanthudu,chiranjeevi  రామ్‌చరణ్‌ వద్ద డబ్బులు లేవా..?
రామ్‌చరణ్‌ వద్ద డబ్బులు లేవా..?
Advertisement
Ads by CJ

మహేష్‌బాబు శ్రీమంతుడు చిత్రం తర్వాత తెలుగు ఇండస్ట్రీలోని పలువురు స్టార్స్‌ గ్రామాలను దత్తత తీసుకొనే కాన్సెప్ట్‌ను ఫాలో అవుతున్నారు. ఇదే విషయం రామ్‌ఛరణ్‌ని అడిగితే డబ్బుల్లేవంటూ విచిత్రమైన సమాధానం చెప్పాడు. మీరు కూడా ఏదైనా గ్రామాన్ని దత్తత తీసుకుంటారా? అని అడిగితే డబ్బులు బాగా సంపాదించాక చూద్దాం... అప్పుడు ఏదైనా గ్రామాన్ని దత్తత తీసుకుంటాను అని సమాధానం చెప్పాడు. ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూ, మరోవైపు వివిధ వ్యాపారాలు చేస్తూ... త్వరలో రెండు ప్రొడక్షన్‌ బేనర్స్‌ను స్థాపించి, తన తండ్రి చిరంజీవి నటించే 150వ చిత్రాన్ని స్వయంగా నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్న రామ్‌చరణ్‌ దగ్గర ఓ గ్రామాన్ని దత్తత తీసుకునే డబ్బులు కూడా లేవా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఆయన మనసులో ఏం ఉంచుకొని ఈ వ్యాఖ్యలు చేశాడు? అనేది అర్థం కావడం లేదని మెగాభిమానులు కూడా అంటున్నారు. మొత్తానికి రామ్‌చరణ్‌ నుండి ఇలాంటి సమాధానం రావడం ఆశ్చర్యకరమే మరి..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ