ఇప్పుడు చాలామంది రుద్రమదేవి కోసం రామ్‌చరణ్ నటించిన బ్రూస్‌లీ చిత్రాన్ని వాయిదా వేయాలనే సుద్దులు చెబుతున్నారు. ఈ విషయంపై రామ్‌చరణ్ స్పందిస్తూ... బాహుబలి విడుదల తర్వాత కొంత గ్యాప్ తీసుకొని తమ సినిమాలను విడుదల చేయాలని బాహుబలి నిర్మాతలు శ్రీమంతుడు, కిక్2 నిర్మాతలను కలిసి ఓ అండర్‌స్టాడింగ్‌కు వచ్చారు. అందుకు అనుగుణంగా ఈ చిత్రాలను ఆయా నిర్మాతలు చాలా గ్యాప్ తీసుకొని విడుదల చేసుకున్నారు. కానీ రుద్రమదేవి విషయంలో మా అందరితో గుణశేఖర్ కనీసం కలుసుకొని అలాంటి అండర్‌స్టాడింగ్‌కు రాలేదు. మరి అందుకోసం అతను ముందుగా మిగిలిన నిర్మాతలను కలిసి ఇలాంటి ఒప్పందం ఎందుకు చేసుకోలేదో మాకు తెలియదు. కాబట్టి మేము ముందుగా అనుకొన్న అక్టోబర్ 16నే మా సినిమాను విడుదల చేస్తున్నాం. ఈ విషయమై నేను బన్నీతో కూడా మాట్లాడాను. కానీ ఫలితం లేకపోయింది... ఇందులో గుణశేఖర్ తప్పే తప్ప మా తప్పు లేదు..అయినా కూడా ఇక నుండి నా సినిమాలను ఇతర సినిమాలకు పోటీగా కాకుండా రెండు వారాలు గ్యాప్ తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను. పోయిన సారి కూడా మాకు కుదిరిన ఒప్పందం ప్రకారం ఆగడు కోసం రెండు వారాల ముందుగానే గోవిందుడు అందరివాడేలే చిత్రాన్ని మేము విడుదల చేశాం... ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి... అంటూ చెప్పుకొచ్చాడు.