హీరోలుగా నటించడమే కాదు సొంత బేనర్లు స్టార్ట్ చేసి తామే సినిమాలు నిర్మిస్తూ నిర్మాతలుగా కూడా సక్సెస్ అవ్వాలని ఎవరికివారు ప్రయత్నాలు చేస్తున్నారు టాలీవుడ్ హీరోలు. ఇప్పటికే చాలామంది హీరోలు ఆ బాటలో పయనిస్తుండగా ఎప్పటి నుంచో మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాని తానే నిర్మిస్తానని చెప్తున్నాడు రామ్‌చరణ్. అయితే ఆ ప్రాజెక్ట్ ఇప్పటికీ పట్టాలెక్కలేదు. ఇదిలా వుండగా రామ్‌చరణ్ వైట్‌హార్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరుతో ఓ చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించబోతున్నాడని తెలిసింది. ఈ బేనర్‌లో 5 కోట్ల లోపు బడ్జెట్ సినిమాలు నిర్మించాలన్న చరణ్ ఆలోచనట. ముఖ్యంగా ఈ బేనర్‌లో కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేయాలన్నది ప్రధాన ఉద్ధేశమని తెలుస్తోంది. త్వరలోనే తన సొంత బేనర్‌ని అధికారికంగా ప్రకటించడానికి రామ్‌చరణ్ రంగం సిద్ధం చేస్తున్నాడని సమాచారం.