Advertisementt

మెగా తనయ కోసం మెగా ఈవెంట్‌!

Mon 12th Oct 2015 04:03 AM
niharika,mega event,niharika heroine entry,ramaraju,oka manasu,naga sourya  మెగా తనయ కోసం మెగా ఈవెంట్‌!
మెగా తనయ కోసం మెగా ఈవెంట్‌!
Advertisement
Ads by CJ

ఇప్పటివరకు స్టార్‌ హీరోల వారసులు హీరోలుగా పరిచయం అవుతున్నారంటే వారిని పరిచయం చేయడం కోసం భారీ ఈవెంట్స్‌ను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక మెగా ఫ్యామిలీ హీరోల లాంచింగ్‌ సమయంలో కూడా ఇలాంటి ఈవెంట్స్‌ జరిగాయి. తాజాగా మెగాబ్రదర్‌ నాగబాబు కుమార్తె నిహారిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. మధురశ్రీధర్‌, టీవీ9 సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి గతంలో మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు చిత్ర దర్శకుడు రామరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నిహారిక.. నాగశౌర్యకు జోడీగా నటించనుంది. హృదయాలను హత్తుకొనే ఫీల్‌గుడ్‌ మూవీగా రూపొందనున్న ఈ చిత్రానికి ఒక మనసు అనే టైటిల్‌ను అనుకొంటున్నారు. తాజాగా మెగా తనయ కోసం కూడా ఓ భారీ ఈవెంట్‌ను నిర్వహించే యోచనలో ఈ చిత్ర యూనిట్‌ ఉంది. ఈ కార్యక్రమానికి మెగాఫ్యామిలీ నుండి చిరంజీవితో పాటు ఇతర స్టార్స్‌ కూడా హాజరవుతారని సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ