ఆమధ్య తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సందర్బంగా చోటుచేసుకున్న పరిణామాల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు తమిళ సినీ నటుల అసోసియేషన్ నడిగర్ సంఘం ఎన్నికలు కూడా అదే స్థాయిలో రసవత్తరంగా మారాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో ఒకరినొకరు తీవ్రంగా దూషించుకునే స్థాయికి వెళ్లింది. ఒకరినొకరు కుక్క, నక్క అంటూ తీవ్రంగా విమర్శించుకోవడం చూసి సినీజనాలు విస్తుపోతున్నారు. ఇటీవలే కమల్‌హాసన్‌పై శరత్‌కుమార్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో అద్యక్ష పదవికి పోటీ చేస్తున్న శరత్‌కుమార్, విశాల్ తమ తమ మద్దతుదారులతో రెండు వర్గాలుగా చీలిపోయారు. గత కొంతకాలంగా ఈ రెండు వర్గాల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. తాజాగా ఇది తారాస్థాయికి చేరింది. శరత్‌కుమార్ వర్గం తరపున ఎన్నికల్లో నిలిచిన యువ హీరో శింబు విశాల్ మీద తనదైన శైలిలో తీవ్ర విమర్శలు గుప్పించాడు. తమిళ నటుల్లో చీలికలు తెచ్చేందుకు విశాల్ ప్రయత్నాలు చేస్తున్నాడని, నిన్నగాక మొన్న వచ్చిన బచ్చా విశాల్ అని, శరత్‌కుమార్ వంటి సీనియర్‌ను విమర్శించే హక్కు విశాల్‌కు లేదు. విశాల్‌ది నీచమైన మనస్తత్వం. తమ వర్గానికి చెందిన సీనియర్ నటుడు రాధారవి విశాల్‌ను కుక్క అనడం తప్పేనని, అయితే విశాల్ మాత్రం నిజానికి ఓ నక్క అంటూ శింబు శివాలెత్తాడు. ఈ విమర్శలు, ప్రతి విమర్శలను చూసి సినీజనాలు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు.