మెగాఫ్యామిలీ హీరోలలో మెగాస్టార్ చిరంజీవిని మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్ వాడుకున్నంతగా ఎవ్వరూ వాడుకోవడం లేదని చెప్పవచ్చు. రేయ్ చిత్రంలో గోలీమార్... అనే పాటను, సుబ్రమణ్యం ఫర్ సేల్ లో గువ్వా గోరింకతో.. పాటను రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సాయి.. పటాస్ ఫేమ్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో దిల్‌రాజు నిర్మాతగా సుప్రీమ్ అనే టైటిల్‌తో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆయన మరోసారి మెగాస్టార్ చిరు పాటను రీమిక్స్ చేసి వాడుకోనున్నాడని సమాచారం. యముడికి మొగుడు చిత్రంలోని సుప్రీం హీరో... డ్రీమ్‌బోయ్.. అనే కోరస్‌తో మొదలయ్యే అందం విందోళం....పాటను రీమిక్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. దీనికి మెగాస్టార్ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడని సమాచారం. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఈ పాటను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.