బ్రూస్‌లీకి అన్యాయం జరిగిందీ అంటే అది రామ్‌చరణ్‌కి జరిగిందని కాదు. ఈ సినిమాకి ఎవరి టైటిల్ అయితే పెట్టారో ఆ బ్రూస్‌లీకి. బ్రూస్‌లీ అనే టైటిల్ పెట్టారు బాగానే వుంది. అది అతని జీవితకథ అయితే ఫర్వాలేదు. పోనీ, ఒక ఫైటర్ కాబట్టి బ్రూస్‌లీ అనే టైటిల్ పెట్టారు. అది కూడా ఓకే. మార్షల్ ఆర్ట్స్ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఒక మహానుభావుడి పేరు అది. ఆ పేరుని గౌరవించాల్సిన బాధ్యత అందరికీ వుంది. బ్రూస్‌లీకి ముందు మార్షల్ ఆర్ట్స్ అంటే ఎంతమందికి తెలుసు? ఎంతమంది ఆ విద్యని నేర్చుకునేవారు అనేది పక్కన పెడితే బ్రూస్‌లీ సినిమాలు చూసిన తర్వాత మాత్రం యూత్‌లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి అనే కోరిక బలపడింది. ఇండియాలో కూడా లెక్కకు మించిన కరాటే, కుంగ్‌ఫూ స్కూల్స్ వెలిశాయి. బ్రూస్‌లీకి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు వున్నారు. అలాంటి వ్యక్తి పేరుని ఒక తెలుగు సినిమాకి పెట్టారంటే సంతోషించాల్సిన విషయమే. అయితే ఈ సినిమాలోని లే.. లే.. బ్రూస్‌లీ అనే పాట మాత్రం బ్రూస్‌లీని అపహాస్యం చేసేలా వుంది. రైమింగ్ కోసం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ లీ అక్షరాన్ని ఎక్కువ వాడుతూ రాసిన ఈ పాట ఇలా సాగుతుంది.. లే.. లే.. బ్రూస్‌లీ నీ చూపుల్లో తగిలింది గూగ్‌లీ.. నువ్ చెయ్యేస్తే నేనే నీ ఫ్యామిలీ.. ఎవడి చూపు పడితే పిందె పండవుతాదో ఆడే నా సుడిగాలి బ్రూస్‌లీ. ఇలా బ్రూస్‌లీ పేరుని ఈ పాటలో విచ్చలవిడిగా వాడేశారు. బ్రూస్‌లీ చచ్చిపోయి బ్రతికిపోయాడు గానీ తన మీద ఇలాంటి పాటను రాసారని, తీశారని తెలిస్తే ఏమైపోయేవాడో.! ఒక లెజెండ్ పేరుని ఇలా ఐటమ్ సాంగ్స్‌లో జొప్పించి కించపరచడం అన్యాయం కదూ!