రాంగోపాల్‌వర్మ ఒకేసారి ఎన్ని చిత్రాలైనా తీయగల సమర్దుడు. అయితే అవి ఎప్పుడు పూర్తవుతాయి? ఎప్పుడు రిలీజ్ అవుతాయి? అనేది మాత్రం ఎవ్వరికీ అర్ధంకాదు. కాగా మీసాలు రాని ఓ టీనేజ్ కుర్రోడు.. తనకంటే వయసుల్లో ఎంతో పెద్దదైన మహిళపై ఆకర్షణ పెంచుకోవడం.. అనే అడల్ట్ అంశాన్ని ఫోకస్ చేస్తూ సావిత్రి అనే పేరుతో ఓ ఫస్ట్‌లుక్ వదిలాడు. దాన్ని చూసి అందరూ ఆయన్ను తీవ్రంగా విమర్శించారు. చివరకు సావిత్రి అనే పతివ్రత పేరును ఇలా వాడుకోవడంపై అందరూ తీవ్ర విమర్శలు గుప్పించేసరికి ఆయన చివరకు ఆ టైటిల్‌ను శ్రీదేవిగా మార్చాడు. దీంతో అతిలోక సుందరి శ్రీదేవి, ఆమె భర్త బోనీకపూర్‌లు నానాగోల చేశారు. కోర్టుకైనా వెళ్తాం... అంతేగానీ శ్రీదేవి అనే పేరును పెట్టడానికి మాత్రం ఒప్పుకోం అంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చారు. దీంతో ఈ చిత్రం ఇక మూలన పడినట్లే అని అందరూ భావించారు. ఈ సినిమా గురించి మరలా వార్తలు రావడం ఆగిపోయాయి. వర్మ కూడా సైలెంట్ అయిపోయాడు.కానీ తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం షూటింగ్‌ను చడీచప్పుడు లేకుండా సైలెంట్‌గా పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది. తొలుత కిరణ్‌ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దర్శకుడు మారిపోయాడని సమాచారం. ఇప్పుడు ఆ స్థానంలో వర్మ శిష్యుల్లో ముఖ్యుడైన జె.డి.చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నాడని తెలుస్తోంది. మరి ఈ చిత్రంతో వర్మ మరెన్ని విమర్శలను ఎదుర్కొంటాడో చూడాలి...!