Advertisementt

అఖిల్‌కు అంతలోనే అంత పట్టింపా..?

Sat 10th Oct 2015 07:45 AM
akhil,akhil movie,nithin,heart attack,poorijagannath  అఖిల్‌కు అంతలోనే అంత పట్టింపా..?
అఖిల్‌కు అంతలోనే అంత పట్టింపా..?
Advertisement
Ads by CJ

అక్కినేని అఖిల్‌ హీరోగా తెరంగేట్రం చేస్తోన్న చిత్రం అఖిల్‌. ఈ చిత్రం దసరా కానుకగా విడుదలకు సిద్దమవుతోంది. కాగా అఖిల్‌ రెండో చిత్రానికి పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అఖిల్‌ మాత్రం తాను పూరీతో కలిసి పనిచేసే ఉద్దేశ్యమే తనకు లేదని సన్నిహితులతో అంటున్నాడట. దీనికి కారణం నితిన్‌ అని సమాచారం. ప్రస్తుతం అఖిల్‌ నటిస్తున్న తొలి చిత్రం అఖిల్‌కు నితినే నిర్మాత అన్న విషయం తెలిసిందే. కేవలం నిర్మాతే కాదు... నితిన్‌ అఖిల్‌కు క్లోజ్‌ ఫ్రెండ్‌గా మారాడు. ఇక హార్ట్‌ఎటాక్‌ టైమ్‌లోనే నితిన్‌కు, పూరీకి స్పర్ధలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల నితిన్‌ మరలా పూరీతో రెండోసారి నటించే అవకాశం వచ్చినప్పటికీ దాన్ని వదులుకున్నాడు. సో.. తన స్నేహితుడైన నితిన్‌ చెప్పిన మాటలు విని అఖిల్‌ పూరీతో చేయకూడదనే నిర్ణయానికి వచ్చాడట. కొత్తగా వస్తున్న హీరో ఇప్పటి నుండే పంతాలకు పోకుండా, అందరితో ఫ్రెండ్లీగా ఉండటం మంచిదని టాలీవుడ్‌ పెద్దలు అఖిల్‌కు సలహా ఇస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ