మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చేయకపోయినా సినీ పరిశ్రమతో మాత్రం ఎప్పుడు టచ్‌లోనే ఉంటాడు. మరీ ముఖ్యంగా మెగాహీరోలు నటించిన సినిమాలు మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటాడు. సాయిధరమ్‌తేజ్, రెజీనా జంటగా ఇటీవల వచ్చిన సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రాన్ని ఆయన ప్రత్యేకంగా షో వేయించుకోని చూశాడట. సినిమా మొత్తం మీద చిరుకు నచ్చింది ఏమిటి? అంటే అని ఆరా తీస్తే రెజీనా అని తేలింది. అవును... చిరుకి రెజీనా నటన, ఆమె ప్రదర్శించిన హావభావాలు బాగా నచ్చాయట. మరీ ముఖ్యంగా గువ్వా గోరింకతో పాటని ఈ సినిమా కోసం రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే. అందులో రెజీనా ఎక్స్‌ప్రెషన్స్ చూసాక చిరు ఆమెకు ఫ్యాన్ అయిపోయడు. ఇదే విషయాన్ని రెజీనాతో కూడా చిరు పంచుకున్నాడట. ఈ కాంప్లిమెంట్‌తో రెజీనా ఉబ్బితబ్బిబైపోతోంది. కాగా ఆమధ్య ఇప్పుడున్న హీరోయిన్లలో తనకు తమన్నా అంటే ఇష్టం అని బహిరంగంగానే ప్రకటించిన చిరును ఇప్పుడు రెజీనా కూడా ఆకట్టుకొంది.