బబ్లీ బ్యూటీ రాశిఖన్నాకు ఓ యాక్షన్ రోల్ పడింది. ఖాకీ డ్రస్‌లో ఆమె ఇరగదీస్తోందిట. మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం సుప్రీమ్. ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తుండగా, పటాస్ ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో రాశిఖన్నా పోలీస్ పాత్రలో సందడి చేయబోతోంది. ఆమెపై కొన్ని యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం రామోజీఫిలింసిటీలో జరుగుతున్న షెడ్యూల్‌లో ఈ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరి రాశిఖన్నా చేసే విన్యాసాలు చూడాలంటే కొద్దికాలం ఆగాల్సిందే. మరి ఈ చిత్రంతోనైనా రాశిఖన్నాకు మంచి బ్రేక్ వస్తుందేమో చూడాలి..!