బాహుబలి చిత్రంతో దర్శకుడు రాజమౌళికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ చిత్రం సాధించిన అఖండ విజయంతో ఆయన భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరిగా స్థానం సంపాదించుకున్నాడు. ఇక టాలీవుడ్‌లో ఆయనను మించిన దర్శకుడు లేడనేది అతిశయోక్తి కాదు. అయితే తాజాగా రుద్రమదేవి విడుదల తర్వాత గుణశేఖర్‌కు కూడా ఆ స్థాయి వుందని అంటున్నారు టాలీవుడ్ జనాలు. చారిత్రక కథాంశంతో రుద్రమదేవి ని జనరంజకంగా తెరకెక్కించిన గుణశేఖర్‌కు ఫైనాన్షియల్ సపోర్ట్‌తో పాటు మరింత టెక్నికల్ టీమ్ కుదిరితే రాజమౌళి స్థాయిలో గుణశేఖర్ కూడా చిత్రాలు తెరకెక్కించగలడని అంటున్నారు సినీజనాలు. సో.. ఇప్పటి వరకు రాజమౌళికి ధీటైన దర్శకుడు లేడని అనుకున్న వాళ్లకి గుణశేఖర్ ఆయనకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడట.