పలువిధాలైన ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్స్‌గా వ్యవహరించడంలో ఇప్పటివరకు మహేష్‌బాబు ముందున్నాడు. ఆయన తర్వాత ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్, రానా, రవితేజ వంటి వారు కూడా ముందుకు సాగుతున్నారు. తాజాగా యువహీరో నిఖిల్‌కు కూడా ఓ కంపెనీకి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్‌గా అవకాశం రావడం విశేషం. వరుస సక్సెస్‌లు సాధిస్తున్న ఈయన కళామందిర్ గ్రూప్ వారి కాంచీపురం వరమహాలక్ష్మీ సిల్క్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్నికయ్యాడు. ఈ అవకాశంతో ఎగ్జైట్ అయిన నిఖిల్ త్వరలో నెల్లూరులో వారి కొత్త బ్రాంచ్‌ను ప్రారంభిస్తున్నాడు. మరి తమకు ఉన్న అంతో ఇంతో క్రేజ్‌తోనే ఇలా పలు బ్రాండ్లకు అంబాసిడర్లుగా అవకాశాలు సంపాదిస్తూ సినిమా రెమ్యూనరేషన్స్‌తో పాటు ఇలా అదనపు ఆదాయం కూడా వెనకేసుకుంటున్నారు.