Advertisementt

సెన్సేషన్‌ కాంబినేషన్‌ తెరకెక్కనుంది..!

Sat 10th Oct 2015 01:37 AM
mahesh babu,murugadoss,nv prasad,tagore madhu  సెన్సేషన్‌ కాంబినేషన్‌ తెరకెక్కనుంది..!
సెన్సేషన్‌ కాంబినేషన్‌ తెరకెక్కనుంది..!
Advertisement
Ads by CJ

ఇప్పుడు టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఓ సంచలన వార్త హాట్‌టాపిక్‌గా మారింది. తమిళంలో దర్శకుడు మురుగదాస్‌కు ఉన్న పాపులారిటీ సామాన్యమైనది కాదు. కోలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లో కూడా కేవలం ఆయన పేరు చూసి సినిమాలకు వెళ్లే అభిమానులు ఎందరో ఉన్నారు. ఇక టాలీవుడ్‌లో సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుకు ఉన్న ఇమేజ్‌ సంగతి అందరికీ తెలిసిందే.కాగా ఇటీవల మహేష్‌ తన ఇమేజ్‌ను కోలీవుడ్‌లో కూడా పెంచుకోవడానికి కృషి చేస్తున్నాడు. శ్రీమంతుడుతో పాటు బ్రహ్మొత్సవం కూడా తమిళంలో కూడా ఒకే రోజు విడుదలకానుంది. కాగా మురుగదాస్‌-మహేష్‌బాబుల కాంబినేషన్‌లో సంచలన చిత్రానికి తెరలేవనుందని సమాచారం. ఈ చిత్రాన్ని ఇద్దరు టాప్‌ ప్రొడ్యూసర్స్‌ కలిసి నిర్మించనున్నారు. నిర్మాత ఎన్వీప్రసాద్‌ దగ్గర మహేష్‌బాబుకు కమిట్‌మెంట్‌ ఉంది. ఇక ఠాగూర్‌ మదు దగ్గర మురుగదాస్‌ డేట్స్‌ ఉన్నాయి. దీంతో ఈ ఇద్దరు నిర్మాతలు కలిసి దాదాపు 80కోట్ల బడ్జెట్‌తో ఓ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం బ్రహ్మొత్సవం అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేస్తున్న మహేష్‌ ఆలోపు మురుగదాస్‌ పూర్తి స్క్రిప్ట్‌ను రెడీ చేస్తే తదుపరి చిత్రంగా దీనినే చేస్తాడని, మురుగదాస్‌ లేట్‌ చేస్తే మాత్రం త్రివిక్రమ్‌, పూరీ, శేఖర్‌కమ్ముల, వినాయక్‌, రాజమౌళి.. ఇలా ఎవరు ముందుగా మంచి స్క్రిప్ట్‌తో వస్తే వెంటనే వారితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ